ఆటగాళ్ళు సినిమాలో జగపతి పాత్ర అదే !

డిఫరెంట్ పాత్రలు చేస్తూ కొత్త దర్శకులను ఎంకరేజ్ చేసే హీరోల్లో నారా రోహిత్ ఒకరు. తాజాగా ఈ హీరో పరుచూరి మురళి దర్శకత్వంలో ‘ఆటగాళ్ళు’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రదాన పాత్రలో కనిపిస్తున్న జగపతిబాబు లాయర్ పాత్రలో కనిపిస్తునట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

కొత్త కథ, కథనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఫ్రెండ్స్ మూవీ క్రియేష‌న్స్ బేన‌ర్‌పై వాసిరెడ్డి రవీంద్ర, వాసిరెడ్డి శివాజీ, మక్కెన రాము, వడ్లపూడి జితేంద్ర నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీతం అందిస్తుండగా విజ‌య్ సీ కుమార్ కెమెరా మెన్ గా పనిచేస్తున్నారు. ఈ సినిమాలో మరో ఇద్దరు హీరోలు కీలక పాత్రలో కనిపించబోతున్నారు. త్వరలో ఆ వివరాలు తెలియనున్నాయి.