మిలియన్ మార్కును అవలీలగా అందుకున్న జగ్గూభాయ్ !


‘లెజెండ్’చిత్రంతో స్టైలిష్ విలన్ గా కొత్త అవతారమెత్తిన నటుడు జగపతిబాబు మరోసారి హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నంలో చేసిన చిత్రమే ‘పటేల్ – ఎస్ఐఆర్’. రెండు రోజుల క్రితమే విడుదలైన ఈ చిత్ర టీజర్ ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంటోంది. అతి తక్కువ సమయంలోనే మిలియన్ మార్కును దాటిపోయింది. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రంలో జగపతిబాబు మేకోవర్ చాలా కొత్తగా ఉండటం, ఆయన పాత్ర చిత్రీకరణ, కాన్సెప్ట్ ఆకర్షణీయంగా ఉండటంతో టీజర్ కు ఇంతటి ఆదరణ దక్కిందని చెప్పొచ్చు.

ఇప్పటి వరకు ఈ టీజర్ 1. 54 మిలియన్ వ్యూస్ సాధించింది. ఒక మాదిరి యంగ్ హీరోలకు కూడా అంట త్వరగా సాధ్యం కాని ఈ ఫీట్ ను జగ్గుభాయ్ ఇంత వేగంగా అందుకొవడం విశేషమనే చెప్పాలి. పైగా రాజమౌళి లాంటి దిగ్గజ దర్శకులు కూడా జగపతి హార్డ్ వర్క్ పై ప్రసంశల వర్షం కురిపించారు. వారాహి చలన చిత్రం బ్యానర్ పై నూతన దర్శకుడు వాసు పరిమి డైరెక్ట్ చేస్తున్నాడు. అలాగే ఈ చిత్రం యొక్క రెగ్యులర్ షూట్ త్వరలోనే మొదలుకానుండగా డీజే వసంత్ సంగీతం, శ్యామ్ కె. నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.