రవితేజ సినిమాలో జగపతిబాబు పాత్ర అదే !

28th, December 2017 - 07:05:28 AM

రవితేజ హీరోగా కళ్యాణ్‌ కృష్ణ డైరెక్షన్ లో ఓ సినిమా రానుంది. జనవరి 5 న ప్రారంభం కానున్న ఈ సినిమా కు ‘నేల టికెట్’ అనే డిఫరెంట్ మాస్ టైటిల్ ఫిక్స్ చేసారు. ‘సోగ్గాడే చిన్ని నాయన’, ‘రారండోయ్ వేడుక చూద్దాం’ వంటి మంచి చిత్రాలు తీసిన కళ్యాణ్ కృష్ణ ఈ సినిమా కు దర్శకత్వం వహిస్తుండడంతో ఈ ప్రాజెక్ట్ కు క్రేజ్ వచ్చింది.

ఎస్‌.ఆర్‌.టి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామ్‌ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో జగపతిబాబు విలన్ గా నటించబోతున్నాడని సమాచారం. మాళవిక శర్మ ఈ మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. రవితేజ నటించిన టచ్ చేసి చూడు సినిమా జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తరువాత శ్రీనువైట్ల దర్శకత్వంలో మరో సినిమాలో నటించబోతున్నాడు రవితేజ.