అమ్మా, ఇప్పటికీ నీకోసం వెతుకుతున్నాను – జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్

Published on Feb 22, 2023 2:39 am IST


బాలీవుడ్ యువ నటి జాన్వీ కపూర్ తొలిసారిగా ధఢక్ మూవీ ద్వారా చిత్ర పరిశ్రమకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దివంగత దిగ్గజ నాయిక శ్రీదేవి కూతురైన జాన్వీ మొదటి సినిమా నుండి ఆకట్టుకునే అందం, అభినయంతో తనను తాను నటిగా ప్రూవ్ చేసుకుంటూ ప్రస్తుతం మంచి క్రేజ్ తో కొనసాగుతున్నారు. లేటెస్ట్ గా ఆమె నటించిన మిలి మూవీ మంచి విజయం అందుకోవడంతో పాటు నటిగా మరింత పేరు, గుర్తింపుని ఆమెకు తెచ్చిపెట్టింది. ఇక ప్రస్తుతం వరుణ్ ధావన్ తో బవాల్, అలానే మిస్టర్ అండ్ మిసెస్ మహి అనే సినిమాల్లో నటిస్తున్నారు జాన్వీ. ఇక అతి త్వరలో ఎన్టీఆర్, కొరటాల శివ కాంబో మూవీ NTR 30లో కూడా ఆమె హీరోయిన్ గా నటించనున్నట్లు సమాచారం.

ఇక తరచు తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఫ్యాన్స్, ఆడియన్స్ తో సినీ, పర్సనల్ విషయాలు పంచుకునే అలవాటు గల జాన్వీ, తన తల్లి శ్రీదేవితో కలిసి కొన్నేళ్ల క్రితం దిగిన ఒక పిక్ ని నేడు పోస్ట్ చేసారు. అమ్మా నేను ఇప్పటికీ నీకోసం వెతుకుతూనే ఉన్నాను, నేను వెళ్లే ప్రతి చోటు, నేను చేసే ప్రతి పని నీతోనే మొదలవుతుంది, అలానే నేను చేసే ప్రతి పని నువ్వు గర్వించేలా చేయడానికి ప్రయత్నిస్తాను అంటూ ఎమోషనల్ గా ఆ పిక్ ని పోస్ట్ చేసిన జాన్వీ, దానికి హార్ట్ ఎమోజీ ని జోడించారు. ప్రస్తుతం ఆ మెమొరబుల్ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత సమాచారం :