ఆఫ్ లైన్ లో “జై బాలయ్య” రూలింగ్.!

Published on Nov 27, 2022 9:00 am IST

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకేక్కిస్తున్న మాస్ ఎంటర్టైనర్ చిత్రం “వీరసింహా రెడ్డి” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొనగా మేకర్స్ కూడా రీసెంట్ గా సాంగ్ సాలిడ్ ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేశారు. మరి ఈ సాంగ్ అయితే యూట్యూబ్ లో అదిరే రెస్పాన్స్ ని అందుకోగా ఇప్పుడు ఆఫ్ లైన్ లో కూడా మాస్ హవా చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది.

ముఖ్యంగా ఏపీలో బాలయ్య ఫ్యాన్స్ లోకి ఈ సాంగ్ బాగా కనెక్ట్ కాగా మంచి రీచ్ ని అయితే ఈ సాంగ్ అందుకుందట. దీనితో జై బాలయ్య ఆన్ లైన్ తో పాటుగా ఆఫ్ లైన్ లో కూడా అదరకొడుతున్నాడని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి అయితే థమన్ సంగీతం అందించగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం :