“జై బాలయ్య” ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది..!

Published on Jan 11, 2022 1:04 am IST

నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను కాంబోలో రూపుదిద్దుకున్న హ్యాట్రిక్‌ చిత్రం “అఖండ”. భారీ అంచనాల మధ్య గత ఏడాది డిసెంబర్ 2న విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తెచ్చుకుని మంచి కలెక్షన్లను రాబట్టుకుంది. ఈ సినిమాలోని “జై బాలయ్య” సాంగ్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. బాలకృష్ణ హుషారైన స్టెప్పులు, అంతే పోటీగా ప్రజ్ఞ్యా జైశ్వాల్ డ్యాన్స్, తమన్ సంగీతం బాగా ఆకట్టుకున్నాయి.

అయితే ఈ ఫుల్ వీడియో సాంగ్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న వారికి చిత్ర బృందం ఆ కానుకను అందించింది. తాజాగా “జై బాలయ్య” ఫుల్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేసింది. ఇక ఈ పాటకు అనంత శ్రీరాం లిరిక్స్ అందించగా, గీతా మాధురి, సాహితి చాగంటి, సత్య యామినీ, అదితి భవరాజు ఆలపించారు.

వీడియో సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :