సూర్య “జై భీమ్” అఫిషియల్ ట్రైలర్ రిలీజ్

Published on Oct 22, 2021 7:50 pm IST


సూర్య హీరోగా జ్ఞానవేల్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం జై భీమ్. ఈ చిత్రం ను సూర్య మరియు జ్యోతిక లు నిర్మించడం జరిగింది. ఈ చిత్రం లో ప్రకాష్ రాజ్, రమేష్, రజిష విజయన్, మనికందన్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం డైరెక్ట్ డిజిటల్ ప్రీమియర్ గా అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమ్ కానున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం నవంబర్ 2 వ తేదీ నుండి ప్రైమ్ వీడియో లో ప్రసారం కానుంది. ఈ చిత్రం కి సంబంధించిన ప్రమోషన్స్ ను సైతం చిత్ర యూనిట్ వేగవంతం చేయడం జరిగింది. తమిళం లో మాత్రమే కాకుండా, ఈ చిత్రాన్ని తెలుగు లో కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అందుకు సంబంధించిన తెలుగు అఫిషియల్ ట్రైలర్ ను తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. చిత్రం ట్రైలర్ విడుదల కావడం తో కొద్ది సేపటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. యూ ట్యూబ్ లో సైతం మంచి వ్యూస్ తో దూసుకు పోతుంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :