“జై భీమ్” నుండి మరొక పాట విడుదల కి సిద్దం!

Published on Oct 24, 2021 8:38 pm IST

సూర్య ప్రధాన పాత్రలో జ్ఞానవేల్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం జై భీమ్. ఈ చిత్రం ను డైరెక్ట్ ఓటిటి గా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ చిత్రం నవంబర్ 2 వ తేదీన తమిళం లో పాటుగా తెలుగు లో కూడా అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ప్రేక్షకులకు, అభిమానులకు అందుబాటులో కి రానుంది. ఈ చిత్రాన్ని 2డి ఎంటర్ టైన్మెంట్ పతాకం పై సూర్య మరియు జ్యోతిక లు నిర్మించడం జరిగింది.

ఈ చిత్రం విడుదల కు దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ షురూ చేసింది. ఇప్పటికే విడుదల అయిన ప్రచార చిత్రాలు, విడియోలు సినిమా పై ఆసక్తి రేకెత్తించే విధంగా ఉన్నాయి. ఈ చిత్రం నుండి తల కొదుం పాట ను విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. రేపు సాయంత్రం అయిదు గంటలకు ఈ పాట విడుదల కానుంది. సూర్య హీరోగా నటించిన ఈ చిత్రం పై భారీ అంచనాలు ఉండటం తో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం :