ఆడియో విడుదలకు సిద్దమైన ‘జై లవ కుశ’ !


యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం ‘జై లవ కుశ’ పై అభిమానుల్లో, ప్రేక్షకుల్లో ఎంతటి అంచనాలు ఉన్నాయో వేరే చెప్పనక్కర్లేదు. ఇప్పటికే ‘జనతాగ్యారేజ్, నాన్నకు ప్రేమతో’ వంటి భారీ హిట్లిచ్చిన తారక్ ఈ సినిమాతో కూడా మంచి విజయాన్ని అందుకుంటాడని అందరూ భావిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా యొక్క ఆడియోను ముందుగా ఈ నెల మొదటి వారంలో రిలీజ్ చేయాలనుకున్నా కూడా గణేష్ నిమజ్జనం హడావుడి మూలాన రద్దుచేసిన సంగతి తెల్సిందే.

అందుకే ఈరోజు సాయంత్రం ఈ పాటలు నేరుగా ఆన్ లైన్లో బయటకురానున్నాయి. ఇక పాటల వేడుక ఎలాగూ లేదు కనుక అభిమానుల కోసం సెప్టెంబర్ 10న హైదరాబాద్లో వేడుక నిర్వహించి ట్రైలర్ ను రిలీజ్ చేస్తామని కూడా తెలిపారు. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 21న భారీ ఎత్తున రిలీజ్ చేయనున్నారు. దేవిశ్రీ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన రాశి ఖన్నా, నివేత థామస్ లు హీరోయిన్లుగా నటించారు.