సెన్సార్ పూర్తి చేసుకున్న ‘జై లవ కుశ’!

13th, September 2017 - 02:03:45 PM


యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన తాజా చిత్రం ‘జై లవ కుశ’ ఈ నెల 21న విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అన్ని పనుల్ని పూర్తిచేసుకున్న ఈ సినిమా తాజగా సెన్సార్ కార్యక్రమాల్ని కూడా ముగించుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి ‘U/A’ సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత కళ్యాణ్ రామ్ స్వయంగా తెలిపారు.

సాధారణంగానే ఎన్టీఆర్ సినిమా అంటే మంచి క్రేజ్ ఉంటుంది. దానికి తోడు విడుదలైన పాటలు, టీజర్స్, ట్రైలర్ అన్నీ బాగుండటం, ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం ఎలా చేశాడో చూడాలని ప్రేక్షక లోకం ఎదురుచూస్తూ ఉండటంతో క్రేజ్ తారా స్థాయికి చేరుకుంది. బాబీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా నివేత థామస్, రాశీ ఖన్నాలు హీరోయిన్లుగా నటించారు.