‘జై లవ కుశ’ ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ !


తారక్ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ‘జై లవ కుశ’ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ‘జనతా గ్యారేజ్’ హిట్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడం, అందులో ఆయన త్రిపాత్రాభినయం చేస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలున్నాయి. కొద్ది రోజుల క్రితమే ఈ చిత్రం యొక్క కొత్త షెడ్యూల్ హైదరాబాద్లో మొదలైంది.

ఇకపోతే ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల తేదీ ఖారరైంది. కొద్దిసేపటి క్రితమే నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ ఈ ఫిసర్ట్ లుక్ మే 19న తారక్ పుట్టినరోజు సందర్బంగా రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ చిత్రంలో రాశి ఖన్నా, నివేత థామస్ లు హీరోయిన్లుగా నటిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇకపోతే సినిమాటోగ్రాఫర్ సీకే మురళీధరన్, హాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్ వాన్స్ హార్ట్వెల్ వంటి టాప్ టెక్నీషియన్లు ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు.