‘జై లవ కుశ’ రన్ టైమ్ కొద్దిగా ఎక్కువే !


తెలుగు ప్రేక్షకులు ఎక్కువగా ఎదురుచూస్తున్న సినిమాల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘ జై లవ కుశ’ కూడా ఒకటి. ఈ నెల 21న రిలీజ్ కానున్న ఈ సినిమా పట్ల ఆడియన్సులో మంచి ఆసక్తి నెలకొని ఉంది. టీజర్స్, పాటలకు, ట్రైలర్ అన్నీ బాగుండటం, తారక్ త్రిపాత్రాభినయం చేస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలున్నాయి. కథ ప్రధాన బలంగా రూపోందిన ఈ సినిమాకు రన్ టైమ్ కాస్త ఎక్కువగానే ఉంది.

సుమారు 155 నిముషాలు అనగా రెండున్నర గంటల పాటు చిత్రం ఉండనుంది. మూడు పాత్రలు కనుక ఆ మాత్రం నిడివి సహజమే మరి. అలాగే ఈ నెల 14న సినిమా సెన్సార్ కార్యక్రమాలకు వెళ్లనుంది. బాబీ డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందివ్వగా కళ్యాణ్ రామ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక ఇందులో ఎన్టీఆర్ కు జోడీగా రాశి ఖన్నా, నివేత థామస్ లు నటించారు.