జై లవకుశ లేటెస్ట్ నైజాం కలెక్షన్స్ వివరాలు!
Published on Oct 4, 2017 6:14 pm IST

ఎన్టీఆర్ హీరోగా బాబి దర్శకత్వంలో దసరా బరిలో జై లవకుశ సినిమా వచ్చిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమా ఎన్టీఆర్ నట విశ్వరూపంతో ఎవరేజ్ టాక్ తెచ్చుకుంది. సినిమా మొదటి వారం నైజాం ఏరియాలో డీసెంట్ కలెక్షన్స్ తెచ్చుకొని రెండో వారంలో ఎంటర్ అయ్యి కలెక్షన్స్ కాస్తా తగ్గిన ఓవరాల్ గా మంచి కలెక్షన్స్ రాబట్టింది. తాజా సమాచారం ప్రకారం నైజాంలో జై లవకుశ కలెక్షన్స్ షేర్ 15 కోట్లు క్రాస్ చేసినట్లు తెలుస్తుంది. ఎన్టీఆర్ సినిమాలో నైజాంలో మంచి కలెక్షన్స్ రాబట్టిన సినిమా జై లవకుశ కావడం విశేషం.

ఈ సినిమా ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ చూసుకుంటే 70 కోట్లు క్రాస్ చేసినట్లు తెలుస్తుంది. ఎన్టీఆర్ మూడు పాత్రల్లో చేసిన అద్బుతమైన పెర్ఫార్మెన్స్ సినిమాని చాలా వరకు నిలబెట్టింది అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు, సమకూర్చగా, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో కళ్యాణ్ రామ్ నిర్మించాడు.

 
Like us on Facebook