యూఎస్ లో కొనసాగుతున్న ‘జై లవ కుశ’ వసూళ్ల జోరు !
Published on Sep 23, 2017 9:24 am IST


గురువారం ప్రేక్షుకుల ముందుకు వచ్చిన ఎన్టీఆర్ జై లవ కుశ చిత్రం భారీ విజయం దిశగా దూసుకుని పోతోంది. ఎన్టీఆర్ కెరీర్ లోనే ఈ చిత్రం బెస్ట్ ఓపెనింగ్ వసూళ్ళని సాధించింది. ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ వద్ద కూడా జై లవ కుశ సత్తా చాటుతోంది. 589,219 డాలర్లని ఈ చిత్రం యుఎస్ ప్రీమియర్ లతోనే రాబట్టింది.

కాగా గురు, శుక్రవారాల్లో కూడా జై లవకుశ వసూళ్లు బలంగా కొనసాగుతున్నాయి. 154,942 డాలర్లని గురువారం వసూలు చేసింది. కాగా శుక్రవారం రాత్రి 10 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రం 233,780 డాలర్లని రాబట్టడం విశేషం. మొత్తంగా ఈ చిత్రం ఓవర్సీస్ లో 977,941 డాలర్లకి రాబట్టి శుక్రవారానికే 1 మిలియన్ డాలర్ల వసూళ్లకు చేరువైపోయింది. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ త్రిపాత్రభినయం చేశాడు. జై పాత్రకు అభిమానుల నుంచి విశేషమైన స్పందన వస్తోంది.

 
Like us on Facebook