1.5 మిలియన్ కు దగ్గరవుతున్న ‘జై లవ కుశ’ !
Published on Sep 24, 2017 5:55 pm IST


ఓవర్సీస్లో తెలుగు సినిమాలకు ఆదరణ పెరిగిన నైపథ్యంలో మన హీరోలందరూ అందరూ మిలియన్ డాలర్ మైలురాయిని ఈజీగా దాటేస్తున్నారు. మొన్న విడుదలైన ‘అర్జున్ రెడ్డి’తో విజయ్ దేవరకొండ, అంతకు ముందే రిలీజైన ‘ఫిదా’ తో వరుణ్ తేజ్ లు బ్రహ్మాండమైన కలెక్షన్లను రాబట్టగా తాజాగా ‘జై లవ కుశ’ తో ఎన్టీఆర్ కూడా యూఎస్ బాక్సాఫీస్ ను షేక్ చేసే పనిలో పడ్డారు. ప్రీమియర్లతోనే 5.5 లక్షల డాలర్లను వసూలు చేసిన తారక్ రెండవరోజుకి మిలియన్ డాలర్ మార్కును దాటేశాడు.

ఇక మూడవ రోజైన శనివారం 169 లోకేషన్ల నుండి 2.7 లక్షల డాలర్లను రాబట్టి మొత్తంగా 1.28 మిలియన్లను చేరుకొని త్వరలో ఒకటిన్నర మిలియన్ ను దాటనున్నారు. ఇక పూర్తి రన్ ముగిసేసరికి కలెక్షన్లు 2 మ్లిలియన్ మార్కును దాటవచ్చని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. తారక్ కు ఇది వరుసగా నాల్గవ మిలియన్ డాలర్ సినిమా కావడం విశేషం. ఆయన గత సినిమాలు ‘జనతా గ్యారేజ్, బాద్షా, నాన్నకు ప్రేమతో’ చిత్రాలు మిలియన్ డాలర్ క్లబ్ లో ఉన్నాయి.

 
Like us on Facebook