క్రేజీ న్యూస్ : ‘ఆదిపురుష్’ ఈవెంట్ లో ‘జైశ్రీరామ్’ సాంగ్ లైవ్ పెర్ఫార్మన్స్ ?

Published on May 19, 2023 8:50 pm IST

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా కృతి సనన్ హీరోయిన్ గా ఓం రౌత్ ప్రస్తుతం తెరకెక్కించిన భారీ పాన్ ఇండియన్ మైథలాజికల్ మూవీ ఆదిపురుష్. రిట్రో ఫైల్స్, టి సిరీస్ ఫిలిమ్స్ సంస్థల పై అత్యంత భారీ వ్యయంతో నిర్మితం అయిన ఈ మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్, ట్రైలర్ అందరినీ ఆకట్టుకోగా, ఇటీవల రిలీజ్ అయిన మోషన్ పోస్టర్ లో చిన్న బిట్ సాంగ్ గా రిలీజ్ అయిన జైశ్రీరామ్ సాంగ్ అందరినీ మరింతగా అలరించింది.

కాగా మ్యాటర్ ఏమిటంటే, త్వరలో ఆదిపురుష్ ప్రమోషన్స్ ని గ్రాండ్ లెవెల్లో జరిపేందుకు ప్లాన్ చేసిన మేకర్స్, జూన్ లో ముంబై లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఎంతో భారీ స్థాయిలో జరుపనుండగా, ఆ ఈవెంట్ లో జైశ్రీరామ్ సాంగ్ ని మ్యూజిక్ డైరెక్టర్స్ అజయ్ అతుల్ లైవ్ ఆర్కెస్ట్రా పెర్ఫార్మన్స్ ని అందించనున్నారట. అలానే దాదాపుగా 30 మంది కోరస్ సింగెర్స్ తో ఈ సాంగ్ లైవ్ లో అదిరిపోనుందని అంటున్నారు. కాగా ఈ ఈవెంట్ గురించిన మరిన్ని అప్ డేట్స్ త్వరలో మేకర్స్ నుండి అఫీషియల్ గా వెల్లడి కానున్నాయి. ఆదిపురుష్ మూవీ జూన్ 16న గ్రాండ్ గా పలు భాషల్లో రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం :