కొన్ని గంటల్లో జై సింహ సెన్సార్ !

సంక్రాంతి కానుక‌గా జ‌నవరి 12న‌ విడుదల కానుంది జైసింహ సినిమా. ఇప్ప‌టికే ఈ సినిమాకు సంభందించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి అయ్యాయి. కెఎస్ రవికుమార్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో నయనతార, హరిప్రియ, నటాషా దోషి హీరోయిన్స్ గా నటించారు.

గౌతమి పుత్ర శాతకర్ణి, కంచే సినిమాలకు సంగీతం అందించిన చిరంతన్ భట్ ఈ మూవీ కి స్వరాలు సమకూర్చారు. సి కళ్యాణ్ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు రేపు పూర్తి కానున్నాయి. డిఫరెంట్ గెటప్ లో బాలయ్య ఈ సినిమాలో కనిపించబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ మొత్తం 70 రోజుల్లో పూర్తి అవ్వడం విశేషం.