‘జై సింహ’ మొదటిరోజు ప్రపంచవ్యాప్త వసూళ్ల వివరాలు !

నందమయూరి బాలకృష్ణ నటించిన ‘జై సింహ’ చిత్రం నిన్న విడుదలై అభిమానుల నుండి మంచి ప్రశంసలు పొందుతున్న సంగతి తెలిసిందే. విడుదలైన ప్రతి చోట చిత్రానికి మంచి వసూళ్లు లభించాయి. ట్రేడ్ వర్గాల సమాచారం మేరకు ఏపి, తెలంగాణల్లో కలిపి రూ.7.2 కోట్ల షేర్ వసూలైనట్టు తెలుస్తోంది.

ఏరియాల వారీగా చూస్తే కలెక్షన్స్ ఈ కింది విధంగా ఉన్నాయి..

ఏరియా కలెక్షన్స్
నైజాం 1.16కోట్లు
సీడెడ్ 1.53కోట్లు
ఉత్తరాంధ్ర 75 లక్షలు
ఈస్ట్ 85 లక్షలు
వెస్ట్ 81 లక్షలు
కృష్ణా 46 లక్షలు
 గుంటూరు 1.15 కోట్లు
నెల్లూరు 37 లక్షలు
కర్ణాటక 60 లక్షలు
ఓవర్సీస్ 25 లక్షలు
రెస్ట్ ఆఫ్ వరల్డ్ 32 లక్షలు
మొత్తం
8.25 కోట్లు