‘జై సింహ, గ్యాంగ్’ కృష్ణ వసూళ్లు !


నందమూరి బాలక్రిష్ణ 102వ చిత్రం ‘జై సింహ’ మాస్ ప్రేలక్షకుల ఆదరణను దక్కించుకుంటూ విజయం దిశగా పయనిస్తోంది. ముఖ్యంగా కృష్ణా జిల్లాలో సినిమా వసూళ్లు స్టడీగా కొనసాగుతున్నాయి. 7 రోజులకుగాను రూ. 1.5 కోట్లను రాబట్టిన ఈ సినిమా 9వ రోజు 2.75 లక్షల షేర్ ను వసూలు చేసిన మొత్తంగా 1.53 లక్షల్ని ఖాతాలో వేసుకుంది.

ఇక సూర్య ‘గ్యాంగ్’ కూడా ఆరంభంలో కొంత నెమ్మదిగానే సాగిన ఆ తర్వాత పుంజుకుని బాక్సాఫీస్ వద్ద మంచి ప్రదర్శనను కనబర్చింది. 7 రోజులకుగాను రూ.46.72 లక్షల షేర్ ను అందుకున్న ఈ సినిమా 9వ రోజు కూడా రూ. 3.29 లక్షలను వసూలుచేసి మొత్తంగా రూ. 53.3 లక్షల్ని ఖాతాలో వేసుకుంది.