కృష్ణా జిల్లాలో ‘జై సింహ, గ్యాంగ్, రంగుల రాట్నం’ వసూళ్లు !


నందమూరి బాలక్రిష్ణ 102వ చిత్రం ‘జై సింహ’ ఈ నెల 12వ తేదీన విడుదలైన సంగతి తెలిసిందే. మాస్ కంటెంట్, ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉన్న ఈ చిత్రం బి, సి సెంటర్ల ప్రేక్షకుల్ని బాగానే అలరిస్తోంది. ముఖాయంగా కృష్ణా జిలాల్లో 4వ రోజు రూ.24.7 లక్షల షేర్ ను రాబట్టి మొత్తంగా రూ. 1.04 కోట్లను ఖాతాలో వేసుకుంది.

అలాగే నాగార్జున నిర్మాణంలో రాజ్ తరుణ్ హీరోగా రూపొందిన ‘రంగుల రాట్నం’ 2వ రోజు రూ . 5. 4 లక్షల షేర్ ను వసూలు చేసి మొత్తంగా రూ.9.45 లక్షల్ని రాబట్టుకుంది. ఇక మరొక చిత్రం ‘గ్యాంగ్’ వసూళ్లలో పెరుగుదల కనిపిస్తోంది. మొదటిరోజేపాజిటివ్ టాక్ ను తెచ్చుకున్న ఈ చిత్రం నిన్న 4వ రోజు రూ.9.06 లక్షల్ని వసూలు చేసి మొత్తంగా రూ. 26.48 లక్షల్ని రాబట్టుకుంది.