జై సింహ పాటల వేడుక రేపే !

పైసా వసూల్ సినిమా తరువాత బాల‌కృష్ణ నటించిన తాజా చిత్రం జై సింహ.ప్రతిస్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా జనవరి 12 న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. కె.ఎస్.రవికుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. సి.కల్యాణ్ నిర్మాత‌గా వ్యవహరించిన ఈ సినిమా లో నయనతార హీరోయిన్ గా నటిస్తోంది.

ఎం.రత్నం కథ మాటలు అందించిన ఈ సినిమాకు చిరంతన్‌ భట్‌ సంగీతం అందిచాడు. రేపు ఈ సినిమా ఆడియో వేడుక విజయవాడ లోని సిద్ధార్థ్ పబ్లిక్ స్కూల్ గ్రౌండ్ లో జరగనుంది. ఈ సినిమాకోసం చిరంతన్ భట్ డిఫరెంట్ మ్యూజిక్ ఇచ్చినట్లు సమాచారం. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నాడు.