జై సింహ టిజర్ కు ముహూర్తం ఫిక్స్ !

బాలకృష్ణ హీరోగా కేఎస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో సంక్రాంతి కానుకగా జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా జై సింహ. బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో నటించిన ఈ సినిమాపై భారి అంచనాలు ఉన్నాయి. నయనతార, నటాషా, హరిప్రియ హీరోయిన్స్ గా నటించిన ఈ మూవీ ని సి.కళ్యాణ్‌ నిర్మిస్తున్నారు.

ఈ నెల 24న విజయవాడలో ఈ సినిమా ఆడియో ని రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ రోజు సాయంత్రం 7:10 నిమిషాలకి సినిమా టిజర్ ను విడుదల చెయ్యనున్నారు. ఈ మూవీ ఉత్తరాంధ్ర హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు సొంతం చేసుకుంటే నైజాం రైట్స్ ను అభిషేక్ పిక్చర్స్ తీసుకున్నారు.