పవర్ ప్యాక్డ్ ట్రైలర్ తో వస్తున్న బాలక్రిష్ణ

నందమూరి బాలక్రిష్ణ 102వ చిత్రం ‘జై సింహ’ చిత్రం జనవరి 12న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అన్ని పనులు పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఈరోజే ఆడియో వేడుకను జరుపుకోనుంది. ఇదే వేడుకలో అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ట్రైలర్ కూడా కుడా రిలీజ్ కానుంది. సుమారు 1.58 నిముషాల నిడివి ఉండే ట్రైలర్ బాలయ్య మార్క్ డైలాగులతో, యాక్షన్ ఫ్రేమ్స్ తో నిండి పవర్ ప్యాక్డ్ గా ఉంటుందని టాక్.

ఇకపోతే ఇది వరకే విడుదలైన టీజర్ ను ప్రేక్షకులు అమితంగా ఆదరించారు. స్టార్ హీరోయిన్ నయనతార బాలక్రిష్ణతో కలిసి నటిస్తున్న ఈ 3వ చిత్రానికి చిరంతన్ భట్ సంగీతాన్ని అందిస్తుండగా సి.కళ్యాణ్ నిర్మిస్తున్నారు. బాలక్రిష్ణ అత్యంత వేగంగా పూర్తిచేసిన ఈ చిత్రంలో హరిప్రియ, నటాషా దోషిలు అనే మరో ఇద్దరు హీరోయిన్లు కూడా నటిస్తున్నారు.