కళ్లుచెదిరే రేటుకు ‘జైలర్ 2’ ఓటీటీ రైట్స్..?

Jailer-2

సూపర్ స్టార్ రజినీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ‘జైలర్ 2’ డిజిటల్ రైట్స్‌కు సంబంధించి ఒక సెన్సేషనల్ న్యూస్ ఫిలిం వర్గాల్లో హల్‌చల్ చేస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ చిత్ర పోస్ట్-థియేట్రికల్ డిజిటల్ హక్కులను ఏకంగా రూ. 160 కోట్లకు చేజిక్కించుకున్నట్లు సమాచారం.

ఫస్ట్ పార్ట్ ‘జైలర్’ డిజిటల్ రైట్స్ రూ.100 కోట్లకు అమ్ముడవ్వగా, ఈ సీక్వెల్‌కు అంతకుమించిన ధరకు డీల్ కుదరడం తమిళ చిత్రసీమలో అత్యంత భారీ ఓటీటీ డీల్స్‌లో ఒకటిగా నిలిచింది. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌ను అక్టోబర్ 15, 2026న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.

టైగర్ ముత్తువేల్ పాండ్యన్‌గా రజినీకాంత్ మళ్లీ సందడి చేయనున్న ఈ చిత్రంలో ఎస్.జె. సూర్య, రమ్యకృష్ణ, యోగి బాబు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా, విజయ్ కార్తీక్ కణ్ణన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. థియేట్రికల్ రిలీజ్‌కి ముందే ఓటీటీ రూపంలో ఈ స్థాయిలో భారీ మొత్తం దక్కడంతో మేకర్స్ లాభాల బాట పట్టినట్లేనని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Exit mobile version