సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన సెన్సేషనల్ సీక్వెల్ సినిమా జైలర్ 2 కోసం అందరికీ తెలిసిందే. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమాని దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించారు. అయితే జైలర్ 1 అంత పెద్ద హిట్ కావడానికి అందులో ఉన్న సర్ప్రైజ్ కామియో రోల్స్ అనే చెప్పాలి.
శివ రాజ్ కుమార్, మోహన్ లాల్ లాంటి దిగ్గజాలతో క్రేజీ సీన్స్ తీసి ఆడియెన్స్ కి థియేటర్స్ లో ఒక మ్యాడ్ ఎక్స్ పీరియన్స్ ని అందించారు. ఇక అలానే సీక్వెల్ లో కూడా మరిన్ని సర్ప్రైజ్ కామియోలు ఉంటాయని కూడా ఖరారు చేసారు. అయితే నేడు సాయంత్రం నుంచే జైలర్ 2 లోని కొత్త పాత్రలని పరిచయం చేస్తున్నట్లు తాజాగా అప్డేట్ అందించారు.
దీనితో థియేటర్స్ లో చూడాల్సిన సర్ప్రైజ్ రోల్స్ ని ముందే రివీల్ చేస్తారా లేదా అనేది నేటి నుంచి ఓ క్లారిటీ వస్తుంది. లేదా ఇప్పుడు మిడ్ రేంజ్ నటులని రివీల్ చేసి థియేటర్స్ లో నేరుగా ఏమన్నా బిగ్ సర్ప్రైజ్ లు ప్లాన్ చేసారా అనేది వేచి చూడక తప్పదు. ఇక ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే సన్ పిక్చర్స్ నిర్మాణం వహించారు.
Character reveals from the world of jailer 2, From Today 6 PM 🔥@rajinikanth @Nelsondilpkumar @anirudhofficial @vijaykartikdop @Nirmalcuts @ChethanDsouza @AlwaysJani @KiranDrk #PallaviSingh @valentino_suren @Alagiakoothan #SantoshRaju @kabilanchelliah @kuchirayar73 @RIAZtheboss… pic.twitter.com/0oqI1KOGfE
— Sun Pictures (@sunpictures) September 18, 2026
