‘జైలర్ 2’ టార్గెట్ జైలర్ 1 వసూళ్లు..!?

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన అవైటెడ్ సీక్వెల్ చిత్రమే ‘జైలర్ 2’. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా తెలుగులో కూడా భారీ ఎత్తున విడుదల కానుంది. లేటెస్ట్ గానే ఈ సినిమా తెలుగు రాష్ట్రాల విడుదల హక్కులు ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ వారు సొంతం చేసుకున్నట్టుగా కూడా రివీల్ చేశారు.

అయితే జైలర్ 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంత టార్గెట్ తో దిగుతుంది అనేది తెలుస్తుంది. జైలర్ పార్ట్ 1 మన దగ్గర ఎంత వసూలు చేసిందో అంత టార్గెట్ తోనే విడుదల కాబోతుందట. జైలర్ 1 కి కేవలం తెలుగు రాష్ట్రాల నుంచి 100 కోట్ల మేర గ్రాస్ వచ్చింది. అంటే అప్పుడు సుమారు 45 నుంచి 50 కోట్ల షేర్ తెలుగు నుంచే వచ్చేసింది.

కానీ అప్పుడు సినిమా కేవలం 12 నుంచి 15 కోట్ల మధ్యలో బిజినెస్ చేసినట్టుగా టాక్. అయితే ఇప్పుడు 45 కోట్లకి పైగానే సితార వాళ్ళు పెట్టారట. సో అప్పుడు వసూళ్లే ఇపుడు టార్గెట్ అని చెప్పాలి. హైప్ కూడా ఇప్పుడు డబుల్ ఉంది కాబట్టి టాక్ పడితే ఈ టార్గెట్ ని తలైవర్ అందుకోవడం పెద్ద విషయం కాదు. కానీ పోటీ కూడా గట్టిగా ఉంది కాబట్టి సినిమా ఎలా పెర్ఫామ్ చేస్తుందో చూడాలి.

Exit mobile version