బుక్ మై షో లో “పఠాన్” రికార్డ్ బ్రేక్ చేసిన “జైలర్”

Published on Sep 3, 2023 11:04 am IST


కోలీవుడ్ తలైవర్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్ లో తెరకెక్కించిన భారీ హిట్ చిత్రం “జైలర్” హవా అయితే థియేటర్స్ లో ఇంకా నడుస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రం నెలకొల్పిన ఎన్నో రికార్డ్స్ లో లేటెస్ట్ గా ఈ ఏడాదికి ఇండియన్ సినిమా దగ్గర బిగ్గెస్ట్ హిట్ అయినటివంటి చిత్రం షారుఖ్ ఖాన్ “పఠాన్” రికార్డుని కూడా బ్రేక్ చేసినట్టుగా తెలుస్తుంది.

మరి బుక్ మై షో లో అయితే పఠాన్ ఫుల్ రన్ లో 9.3 మిలియన్ టికెట్స్ అమ్ముడుపోగా జైలర్ కి కేవలం ఈ 25 రోజుల్లోనే 9.4 మిలియన్ టికెట్స్ అమ్ముడుపోయాయట. అంతే కాకుండా అందులో వోటింగ్స్ పరంగా కూడా జైలర్ పఠాన్ ని క్రాస్ చేసింది అని తెలుస్తుంది. దీనితో మొత్తానికి అయితే జైలర్ హవా ఇండియన్ సినిమా దగ్గర ఏ లెవెల్లో ఉందో అర్ధం చేసుకోవచ్చు.

సంబంధిత సమాచారం :