ఓటిటిలో వరల్డ్ వైడ్ “జైలర్” హవా.!

Published on Sep 12, 2023 11:00 am IST

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ అలాగే కన్నడ నటుడు శివ రాజ్ కుమార్ ల కలయికలో దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన సెన్సేషనల్ హిట్ చిత్రం “జైలర్” కోసం తెలిసిందే. ఇప్పటికే భారీ రన్ తో కంటిన్యూ అవుతున్న ఈ చిత్రం ఆల్రెడీ ఓటిటి లో కూడా వచ్చేసింది. అయినా థియేటర్స్ లో బాగానే రన్ అవుతున్న ఈ చిత్రం థియేటర్స్ తో పాటుగా ఓటిటి లో కూడా సెన్సేషనల్ రెస్పాన్స్ ని ఇప్పుడు అందుకుంటుంది.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయిన ఈ చిత్రం ఇపుడు వరల్డ్ వైడ్ గా అయితే ట్రెండింగ్ లో నిలిచిందట. అంతే కాకుండా ఇప్పుడు ప్రైమ్ వీడియోలో వరల్డ్ వైడ్ టాప్ 2లో సినిమాలు నుంచి ట్రెండింగ్ లో నిలవగా మొత్తం 35 దేశాల్లో సినిమా ట్రెండింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. దీనితో జైలర్ ఓటిటి లో కూడా మామూలు రెస్పాన్స్ ని అందుకోలేదు అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించగా సన్ పిక్చర్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :