“జైలర్” ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్.!

Published on Sep 2, 2023 3:00 pm IST

కోలీవుడ్ సూపర్ స్టార్ తలైవర్ రజినీకాంత్ హీరోగా నటించిన లేటెస్ట్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం “జైలర్” ఇప్పటికీ థియేటర్స్ లో దుమ్ము లేపుతుండగా ఈ ఏడాదికి అయితే కోలీవుడ్ నుంచి హైయెస్ట్ గ్రాసర్ గా కూడా నిలిచింది. మరి ఈ చిత్రం గత కొన్ని రోజులు కితమే ఓటిటి డెబ్యూ ఎప్పుడు ఏంటి అనేది టాక్ వచ్చింది. అయితే ఇప్పుడు దీనిపై అధికారిక క్లారిటీ అయితే వచ్చేసింది అని చెప్పాలి.

ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు సొంతం చేసుకున్న దిగ్గజ స్ట్రీమింగ్ యాప్ అమేజాన్ ప్రైమ్ వీడియోలో అయితే ఈ చిత్రం పాన్ ఇండియా భాషల్లో ఈ సెప్టెంబర్ 7 నుంచే స్ట్రీమింగ్ కి వచ్చేయనుండడం కన్ఫర్మ్ అయ్యింది. అంటే నెల లోపే ఈ సినిమా ఓటిటి లో వచ్చేస్తుంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రంలో మోహన్ లాల్, శివ రాజ్ కుమార్ లు సాలిడ్ క్యామియో పాత్రల్లో నటించగా అనిరుద్ సంగీతం అందించాడు. అలాగే అనిరుద్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :