వైరల్ అవుతున్న “అవతార్ 2” కాన్సెప్ట్ పోస్టర్స్..చూసారా?

Published on Sep 15, 2021 9:00 am IST


వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దగ్గర డైరెక్టర్ జేమ్స్ కేమరూన్ వండర్ ఫుల్ క్రియేషన్స్ నమోదు చేసిన లెక్కలే వేరు.. ఎప్పుడో 90 లలో వచ్చిన టైటానిక్ సినిమాతోనే ఆల్ టైం వరల్డ్ రికార్డు సెట్ చేసి మళ్ళీ దానిని 2009లో మరో అద్భుత సృష్టి “అవతార్” తో బ్రేక్ చేసాడు. మరి ఇప్పటికీ కూడా దీని రికార్డులు అలా పదిలంగానే ఉన్నాయి. అయితే ఈ అవతార్ సినిమా అన్ని దేశాలతో పాటు ఇండియాలో కూడా ఒక రేంజ్ లో ఆడింది.

ఇక ఈ అద్భుత చిత్రానికి ఒకటి కాదు ఏకంగా నాలుగైదు సీక్వెల్స్ ని కేమరూన్ ఆల్రెడీ రెడీ చేస్తుండగా పార్ట్ 2 కోసం మాత్రం ప్రపంచం అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంది. దీనిని ఎప్పుడో అనౌన్స్ చేసినప్పటికీ రిలీజ్ మాత్రం కరోనా మూలాన వాయిదా పడింది. మరి ఈ సినిమాకి సంబంధించి కొన్ని కాన్సెప్ట్ పోస్టర్స్ ఇప్పుడు బయటకి వచ్చి వైరల్ అవుతున్నాయి.

సినిమాలోని కొన్ని సన్నివేశాల్లా కొన్ని పోస్టర్స్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. వీటిని చూస్తే మొదటి భాగం కన్నా ఇందులో విజువల్స్ ఇంకా కొత్తగా అద్భుతంగా ఉండేలా ఉన్నాయని తెలుస్తుంది. మరి అవి ఏ రేంజ్ లో ఉన్నాయో మీరు కూడా చూడండి. మరి ఈ బిగ్గెస్ట్ ఫాంటసీ చిత్రం వచ్చే ఏడాది ఆఖరున రిలీజ్ అవ్వనున్నట్టుగా తెలుస్తుంది..

సంబంధిత సమాచారం :