‘జన నాయగన్’ రిలీజ్‌పై మరో బ్యాడ్ న్యూస్.. ఇప్పట్లో లేనట్టేనా..?

Jana Nayagan

తమిళ స్టార్ హీరో థళపతి విజయ్ నటించిన ‘జన నాయగన్’ (Jana Nayagan)సినిమా సెన్సార్ సమస్యల నుంచి ఇంకా బయటపడలేకపోతోంది. ఈ అంశం ప్రస్తుతం న్యాయస్థానంలో ఉండగా, నేడు(జనవరి 9) జస్టిస్ పి.టి.ఆశా సెన్సార్ బోర్డు వెంటనే సర్టిఫికెట్ జారీ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. అయితే సీబీఎఫ్‌సీ దీనిపై అభ్యంతరం తెలుపుతూ, చీఫ్ జస్టిస్ మనీంద్ర మోహన్ శ్రీవాస్తవ, జస్టిస్ జి. అరుల్ మురుగన్‌లతో కూడిన ఫస్ట్ డివిజన్ బెంచ్ ముందు రిట్ అప్పీల్ దాఖలు చేసింది.

అయితే, తాజా సమాచారం ప్రకారం, మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను తాత్కాలికంగా నిలిపివేశారు. అంటే విజయ్ చిత్రానికి U/A సర్టిఫికెట్ ఇవ్వాలన్న ఆదేశంపై స్టే విధించారు. ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణను పొంగల్ సెలవుల అనంతరం, జనవరి 21కు వాయిదా వేశారు.

ఈ పరిణామాలతో ‘జన నాయగన్’ సినిమా త్వరలో థియేటర్లకు వచ్చే అవకాశాలు లేనట్టుగా స్పష్టమవుతోంది. స్టార్ హీరో చివరి సినిమా ఇలాంటి అడ్డంకుల్లో చిక్కుకోవడంతో అభిమానులు తీవ్రంగా నిరాశకు గురవుతున్నారు. ఈ చిత్రంలో బాబీ డియోల్, పూజా హెగ్డే, మమిత బైజు కీలక పాత్రల్లో నటిస్తుండగా, సినిమాపై ఉన్న అంచనాలు మాత్రం ఇంకా తగ్గలేదని చెప్పాలి.

Exit mobile version