సుహాస్ “జనక అయితే గనక” టీజర్ ను రిలీజ్ చేయనున్న ప్రభాస్!

సుహాస్ “జనక అయితే గనక” టీజర్ ను రిలీజ్ చేయనున్న ప్రభాస్!

Published on Jul 3, 2024 11:26 PM IST

టాలెంటెడ్ యాక్టర్ సుహాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. చివరిసారిగా ప్రసన్నవదనం చిత్రంలో కనిపించారు. ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. తదుపరి జనక అయితే గనక అనే చిత్రంలో కనిపించనున్నారు. దిల్ రాజు ప్రొడక్షన్స్ పతాకంపై హర్షిత్ రెడ్డి మరియు హన్షితా రెడ్డి లు నిర్మిస్తున్న ఈ చిత్రానికి సందీప్ రెడ్డి బండ్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం

ఈ చిత్రం కి సంబందించిన టీజర్ ను జూలై 4 వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే రెబల్ స్టార్ ప్రభాస్ ఈ టీజర్ ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. సంగీర్త‌న విపిన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి విజ‌య్ బుల్గ‌నిన్ సంగీతం అందిస్తున్నారు. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు