ఆర్ ఆర్ ఆర్ నుండి విడుదలైన జనని వీడియో సాంగ్..!

Published on Nov 26, 2021 4:15 pm IST

ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న జనని వీడియో సాంగ్ ఎట్టకేలకు విడుదల అయ్యింది. ప్రకటించిన సమయం కంటే గంట ముందే ఈ వీడియో సాంగ్ భారతీయులను వివిధ బాషల్లో పలకరించడం జరిగింది. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అలియా భట్, అజయ్ దేవగణ్, శ్రియ శరణ్ లు ప్రధాన తారాగణం ఈ వీడియో లో కనిపించడం జరిగింది. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తూ, ఈ పాటకి గొంతు కలపడం జరిగింది. వరుణ్ గ్రోవర్ ఈ పాటకి లిరిక్స్ రాయడం జరిగింది.

రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో నటిస్తున్నారు. ఈ ఇద్దరి పాత్రల కి అనుగుణంగా ఈ వీడియో సాంగ్ లో అల్టిమేట్ ఎమోషన్స్ తో చూపించడం జరిగింది. ఒక్క ఈ పాటలోని ఇన్ని ఉంటే, సినిమాలో ఇంకెన్ని అద్భుతాలు ఉన్నాయో అంటూ అభిమానులు చెప్పుకుంటున్నారు.

జనవరి 7 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇండియా లోనే బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా గా, పీరియాడిక్ మూవీ గా వస్తుండటం తో ఈ సినిమా చరిత్రలో నిలుస్తుంది అని చెప్పడం లో సందేహం లేదు. ఒలివియా మోరిస్ మరొక హీరోయిన్ గా, సముద్ర ఖని కీలక పాత్ర లో నటిస్తున్న ఈ సినిమాను డివివి దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

పాట కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :