“ఆర్ఆర్ఆర్” మూవీ నుండి విడుదల కి సిద్దమైన “జనని” సాంగ్!

“ఆర్ఆర్ఆర్” మూవీ నుండి విడుదల కి సిద్దమైన “జనని” సాంగ్!

Published on Nov 22, 2021 6:55 PM IST


రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం రౌద్రం రణం రుధిరం. ఈ చిత్రం ను డివివి దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్, కొమురం భీం పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ లు నటిస్తున్నారు. ఈ చిత్రం లో బాలీవుడ్ భామ అలియా భట్, హాలివుడ్ భామ ఒలివియా మోరిస్ లు హీరోయిన్స్ గా నటిస్తుండగా, అజయ్ దేవగన్, శ్రియ శరణ్, సముద్ర ఖని లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, విడియోలు, పాటలు విడుదలై ప్రేక్షకులను అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఈ చిత్రం నుండి మరొక లిరికల్ వీడియో విడుదల కి సిద్దం గా ఉంది. ఈ చిత్రం నుండి పెద్దన్న లిరికల్ వీడియో సాంగ్ ను నవంబర్ 26 వ తేదీన విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా ఒక పోస్టర్ ద్వారా ప్రకటించడం జరిగింది. జనని అంటూ సాగే ఈ పాట పవర్ ఫుల్ గా మరియు ఎమోషనల్ గా సాగనుంది. ఇందుకు సంబంధించిన పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా వచ్చే ఏడాది జనవరి 7 వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు