రేపు సాయంత్రం విడుదల కానున్న జనని వీడియో సాంగ్!

రేపు సాయంత్రం విడుదల కానున్న జనని వీడియో సాంగ్!

Published on Nov 25, 2021 8:33 PM IST


రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం రౌద్రం రణం రుధిరం. ఈ చిత్రం లో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్, కొమురం భీమ్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ లు నటిస్తున్నారు. ఒలివియా మోరిస్, అలియా భట్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అజయ్ దేవగన్, శ్రియ శరణ్, సముద్ర ఖని లు కీలక పాత్రల్లో నటిస్తుండగా, ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, విడియోలు, పాటలు ప్రేక్షకులను అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఈ చిత్రం నుండి జనని అనే వీడియో సాంగ్ ను చిత్ర యూనిట్ విడుదల చేసేందుకు సిద్దమైంది. ఈ పాటను నవంబర్ 26 వ తేదీన విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. రేపు సాయంత్రం 4 గంటలకు ఈ పాటను విడుదల చేస్తున్నట్లు సరికొత్త పోస్టర్ తో ప్రకటించడం జరిగింది.

వచ్చే ఏడాది జనవరి 7 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా వివిధ బాషల్లో విడుదల కానున్న ఈ భారీ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు