6వ రోజు జనతా గ్యారేజ్ కలెక్షన్ల వివరాలు

janatha-garage-2
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘జనతా గ్యారేజ్’ చిత్రం విడుదలైన మొదటిరోజు నుండే మంచి పాజిటివ్ టాక్ సంపాదించి వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ చిత్రంతో తారక్ పలు ఇండస్ట్రీ రికార్డుల్ని సొంతం చేసుకున్నాడు. ‘బాహుబలి’ తరువాత మొదటి వారంలోనే రూ. 60 కోట్ల షేర్ సాధించిన తెలుగు చిత్రంగా ఇది నిలిచింది. ఇకపోతే నిన్న 6వ రోజు కూడా వసూళ్ల జోరు కనిపించింది. అన్ని ఏరియాల్లో సినిమా దాదాపు హౌస్ ఫుల్ గా నడిచింది. దీంతో 6 రోజులకు గాను ఏపీ, తెలంగాణా రాష్ట్రాల్లో మొత్తం షేర్ రూ. 43. 22 కోట్లుగా ఉంది. అలాగే కర్ణాటకలో రూ. 6.72 కోట్లు, యూఎస్ లో రూ. 7.01 కోట్లు రాబట్టింది. ఆ కలెక్షన్ల వివరాలు ఇలా ఉన్నాయి.

ఏరియా కలెక్షన్స్
నైజాం : 14.24 కోట్లు
సీడెడ్ : 8.16 కోట్లు
వైజాగ్ : 5.12 కోట్లు
తూర్పు గోదావరి : 3. 77 కోట్లు
పశ్చిమ గోదావరి : 3.23 కోట్లు
కృష్ణా : 3. 42 కోట్లు
గుంటూరు : 4.56 కోట్లు
నెల్లూరు :  1.6 కోట్లు
మొత్తం : 43. 22 కోట్లు