‘జనతా గ్యారేజ్’ ఆడియో రిలీజ్ డేట్ ఇదేనా..!

janathagarage1
మిర్చి, శ్రీమంతుడు వంటి సూపర్ హిట్ చిత్రాల తరువాత దర్శకుడు ‘కొరటాల శివ’ చేస్తున్న సినిమా ‘జనతా గ్యారేజ్’. ‘యంగ్ టైగర్ ఎన్టీఆర్’ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. మొదట సినిమాని ఆగష్టు 12న విడుదల చేయాలని ప్లాన్ చేసినప్పటికీ సమయం తక్కువగా ఉండటంతో సినిమా పోస్ట్ ప్రొడక్షన్ లో క్వాలిటీ తగ్గుతుందని అందుకే కాస్త ఆలస్యమైనా సినిమా క్వాలిటీగా ఉండాలని భావించిన చిత్ర టీమ్ రిలీజ్ డేట్ ను స్పెటెమ్బర్ 2కు వాయిదా వేసుకుంది.

అలాగే ఆడియో కార్యక్రమాన్ని కూడా ఆగష్టు 13న ఘనంగా అభిమానుల మధ్య జరపాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ ‘మోహన్ లాల్’ ఓ కీలక పాత్ర పోషిస్తుండగా ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యా మీనన్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మరో మలయాళ నటుడు ‘ఉన్ని ముకుందన్’ విలన్ పాత్రలో నటిస్తున్నాడు.