ఆల్ టైమ్ బిగ్గెస్ట్ హిట్స్ లో స్థానం దక్కించుకున్న ‘జనతా గ్యారేజ్’

20th, September 2016 - 12:14:19 PM

janatha-garage-2
ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘జనతా గ్యారేజ్’ విజయవంతంగా నడుస్తూ రికార్డ్ కలెక్షన్లను కొల్లగొడుతోంది. రిలీజ్ డే రోజున మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ ఆ తరువాత చిత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ. 75 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన ఈ చిత్రం మెగా సినిమాలైన ‘మగధీర, అత్తారింటికి దారేది’ లను దాటుకుని టాలీవుడ్ ఆల్ టైమ్ హిట్స్ లో మూడవ స్థానం దక్కించుకుంది.

ఇకపోతే ఈ వారాంతం కూడా సినిమాకి మంచి ఆదరణ దక్కింది. దాదాపు అన్ని మల్టీప్లెక్స్ థియేటర్లు 85 శాతం వరకూ నిండాయి. ఈ కలెక్షన్లు ఇలాగే కొనసాగితే ఇంకొద్ది రోజుల్లో ఈ చిత్రం రెండవ స్థానంలో ఉన్న మహేష్ బాబు ‘శ్రీమంతుడు’ని కూడా క్రాస్ చేసే అవకాశముంది. పైగా చివరి వారంలో వచ్చిన ‘సిద్దార్థ, నిర్మలా కాన్వెంట్’ వంటి చిత్రాలు కూడా అంతంతమాత్రంగానే ఉండటం ఈ సినిమాకు కలిసొచ్చే అంశంగా మారింది. ఇకపోతే కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 125 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది.