జనతా గ్యారేజ్ లేటెస్ట్ యూఎస్ కలెక్షన్స్

Janatha-Garage
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజా చిత్రం ‘జనతా గ్యారేజ్’ యూఎస్ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. మొదటి రెండు రోజులకే మిలియన్ డాలర్ మార్క్ దాటేసిన ఈ చిత్రం బలమైన పాజిటివ్ టాక్ తో దూసుకెళుతోంది. శనివారం మూడవరోజు యూఎస్ లో ఈ చిత్రం $277,754 వసూళ్లు రాబట్టింది. దీంతో సర్దార్ గబ్బర్ సింగ్, బ్రహ్మోత్సవం, పెళ్లి చూపులు చిత్రాల తరువాత ఆ $1.2 మిలియన్ మార్క్ క్రాస్ చేసిన తెలుగు చిత్రంగా నిలిచింది.

అంతేగాక ఎన్టీఆర్ కెరీర్లో ‘నాన్నకు ప్రేమతో, టెంపర్’ చిత్రాల తరువాత మిలియన్ మార్క్ దాటిన మూడవ సినిమాగా ‘జనతా గ్యారేజ్’ నిలబడింది. బలమైన ఎమోషన్, మోహన్ లాల్, ఎన్టీఆర్ ల కట్టిపడేసే నటన ప్రధానాంశాలుగా మారి థియేటర్ వైపుకు ప్రేక్షకుల్ని నడిపిస్తున్నాయి. సెప్టెంబర్ 5 యూఎస్ లో సెలవుదినం కావడం ఈ సినిమాకి మరో కలిసొచ్చే అంశం. ఇకపోతే ఈరోజు నుండి ఈ చిత్రాన్ని జపాన్ లో సైతం విడుదల చేస్తుండటం విశేషం.