మిలియన్ మార్క్ ను దాటేసిన ‘జనతా గ్యారేజ్’

janatha-garage-2
మొదటిరోజే అద్భుతమైన ఓపెనింగ్స్ సాధించి ఎన్టీఆర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ గ్రాసర్ గా నిలిచిన ‘జనతా గ్యారేజ్’ చిత్రం యూఎస్ బాక్సాఫీస్ వద్ద కూడా హవా చూపుతోంది. మొదటిరోజే ప్రీనియర్ల ద్వారా దాదాపు $592,000 కలెక్షన్లను రాబట్టిన ఈ సినిమా మొదటిరోజు వచ్చిన పాజిటివ్ టాక్ తో రెండవరోజు కూడా అదే ఊపు కొనసాగించి 3వ రోజుకి మిలియన్ మార్క్ ను క్రాస్ చేసేసింది.

దీంతో ఎన్టీఆర్ కెరీర్లోనే అతిపెద్ద గ్రాసర్ గా ఈ చిత్రం నిలిచింది. అంతేగాక తెలుగు రాష్ట్రాల్లో సైతం మంచి క్రేజ్ తో నడుస్తున్న ఈ సినిమా రెండవరోజుకి రూ.25. 76 కోట్ల వసూళ్లు సాధించి బయ్యర్లంతా సేఫ్ జోన్లోకి వెళ్లేలా చేసింది. దీంతో హీరో ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివలు సక్సెస్ ను ఎంజాయ్ చేసే పనిలో పడ్డారు. సమంత, నిత్యా మీనన్లు హీరోయిన్లుగా నటించిన ఈ ఎమోషనల్ ఎంటర్టైనర్లో మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ ఓ ప్రధాన పాత్రలో నటించారు.