సెన్సార్‌కు సిద్ధమవుతోన్న ‘జనతా గ్యారెజ్’!

Janatha-Garage-ntr
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘జనతా గ్యారెజ్’ సినిమా సెప్టెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు పక్కాగా సిద్ధమైన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ మొత్తం పూర్తికాగా, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా చివరిదశకు చేరిపోయాయి. తాజాగా అందిన సమాచారం మేరకు ఆగష్టు 27కల్లా పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం పూర్తి చేసి సినిమాను సెన్సార్‌కు తీసుకెళ్ళేలా టీమ్ ప్లాన్ చేస్తోందట. ఇక మరోపక్క ప్రమోషనల్ కార్యక్రమాలను కూడా ఈవారం నుంచే మొదలుపెట్టాలని టీమ్ భావిస్తోందట.

’మిర్చి’, ’శ్రీమంతుడు’ సినిమాలతో దర్శకుడిగా తనదైన బ్రాండ్ సృష్టించుకున్న కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా ఓ సోషల్ మెసేజ్ ఉన్న కమర్షియల్ సినిమాగా ప్రచారం పొందుతోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, ఆడియో సినిమాపై అంచనాలను పెంచేశాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యా మీనన్‌లు హీరోయిన్లుగా నటించారు.