‘జనతా గ్యారెజ్’ రన్‌టైమ్ ఎంతంటే..!

janathagarage1
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘జనతా గ్యారెజ్’ విడుదలకు సర్వం సిద్ధమైపోయింది. రేపు ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానున్న ఈ సినిమా ఈ అర్థరాత్రి నుంచే బెనిఫిట్ షోస్‌తో సందడి మొదలుపెట్టనుంది. ఇక తన గత చిత్రాల్లానే సోషల్ మెసేజ్ ఉన్న యాక్షన్ డ్రామాగా జనతా గ్యారెజ్ తెరకెక్కిందని, అనవసరమైన సన్నివేశాలేవీ లేకుండా, పూర్తిగా కథ చుట్టూనే తిరిగే ఈ సినిమా 2 గంటల 28 నిమిషాల నిడివి ఉంటుందని దర్శకుడు కొరటాల శివ తెలిపారు. ఈ సినిమాలో అసందర్భమైన పాటలు, కామెడీ ఎపిసోడ్స్ ఉండవని, రెండున్నర గంటల పాటు ప్రేక్షకులను కూర్చోబెట్టే కథే హైలైట్ అని శివ అన్నారు.

మైత్రీ మూవీస్ తెరకెక్కించిన ఈ సినిమాలో సమంత, నిత్యా మీనన్‌లు హీరోయిన్లుగా నటించారు. దేవిశ్రీ అందించిన ఆడియో సూపర్ హిట్ అవ్వడం, ట్రైలర్ అదిరిపోయేలా ఉండడం, ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్ లాంటివన్నీ ఈ సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చాయి. మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ తెచ్చుకునే అవకాశం ఉన్న ఈ సినిమాలో మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించడం ఓ ప్రత్యేక విశేషంగా కనిపిస్తూ వస్తోంది.