3 మిలియన్ డాలర్లు ఆశిస్తున్న ఎన్టీఆర్ !

29th, August 2016 - 08:47:08 AM

janathagarage1
ప్రస్తుతం టాలీవుడ్ లో ఇంకొన్నిరోజుల్లో విడుదలకాబోతున్న ఎన్టీఆర్ ‘జనతా గ్యారేజ్’ చిత్రం హవా స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, ఆడియో అన్నీ బాగుండటంతో చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టే జనతాగ్యారేజ్ టీమ్ కూడా సరికొత్త రికార్డులపై కన్నెసింది. ఇప్పటికే ఈ సినిమా ప్రీమియర్ షోల విషయంలో అత్యధిక థియేటర్లలో విడుదలవుతూ సెన్సేషన్ క్రియేట్ చేయడానికి సిద్దమవుతున్న తరుణంలో యూఎస్ బాక్సాఫీస్ వద్ద కూడా భారీ కలెక్షన్లను రాబట్టాలని చూస్తోంది.

గతంలో ఎన్టీఆర్ నటించిన ‘టెంపర్’ 1 మిలియన్ డాలర్ మార్క్ క్రాస్ చేయగా మరో చిత్రం ‘నాన్నకు ప్రేమతో’ ఏకంగా 2.1 మిలియన్ డాలర్లను వసూలు చేసి తెలుగు సినిమా వసూళ్ళలో నాలుగో స్థానంలో నిలిచింది. దీంతో ‘జనతా గ్యారేజ్’ చిత్రం ఖచ్చితంగా 3 మిలియన్ డాలర్లను కొల్లగొడుతుందని ఎన్టీఆర్ సహా, యూఎస్ డిస్ట్రిబ్యూటర్లు ధీమాగా ఉన్నారట. సమంత, నిత్యా మీనన్లు హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం సెప్టెంబర్ 1న విడుదలకానుంది.