ఫ్యాన్స్ మధ్య గ్రాండ్ గా జరగనున్న ‘జనతా గ్యారేజ్’ విజయోత్సవం

janata-garage

జనత గ్యారేజ్.. పరిశ్రమలో సరికొత్త రికార్డులు సృష్టించి హీరో తారక్ కెరీర్ ను పూర్తిగా మలుపుతిప్పిన సినిమా. ‘బాహుబలి’ తరువాత అత్యంత వేగంగా రూ. 100 కోట్ల క్లబ్ లో చేరిన ఈ చిత్రంతో ఎన్టీఆర్ ఇమేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. టాప్ డైరెక్టర్లందరూ ఆయనతో సినిమాలు చేయడనికి క్యూ కడుతున్నారు. ఇంతటి ఘన విజయానికి కారణమైన అభిమానుల మధ్య ఈ చిత్రం యొక్క విజయోత్సవాన్ని జరపాలని జనతా గ్యారేజ్ టీమ్ నిర్ణయించారు.

హైదరాబాద్ లోని జె ఆర్ సి కన్వెన్షన్ సెంటర్ వేదికగా ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఈ విజయోత్సవ వేడుక జరగనుంది. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్, సమంత, నిత్యామీనన్, దర్శకుడు కొరటాల శివ, ఇతర టీమ్ హాజరుకానున్నారు. ఈ కార్యక్రమం కోసం ఇప్పటికే భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో ఈ వేడుకకు హాజరుకానున్నారు.