జపాన్ లో విడుదలకానున్న ‘జనతా గ్యారేజ్’

janatha-garage-2
సెప్టెంబర్ 1న విడుదలై హిట్ టాక్ సొంతం చేసుకుని తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ. 30 కోట్ల వసూళ్లు సాధించి పలు రికార్డులను క్రియేట్ చేసిన ‘జనతా గ్యారేజ్’ చిత్రం ఈరోజు జపాన్ లో విడుదలకానుంది. మామూలుగానే జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ కు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అక్కడ ఆయన డ్యాన్సులు, ఎనర్జిటిక్ యాక్టింగ్ అంటే ప్రేక్షకులకు బాగా ఇష్టం. అందుకే చిత్రాన్ని జపాన్ లో సబ్ టైటిల్స్ తో విడుదల చేయనున్నారు.

స్కిప్ సిటీ ఇంటర్నేషనల్ ద్వారా సినిమా విడుదలకానుంది. గతంలోనూ తారక్ సినిమాలు జపాన్ లో విడుదలైన సంగతి తెలిసిందే. బలమైన ఎమోషనల్ కంటెంట్ కలిగిఉన్న ఈ చిత్రంలో మోహన్ లాల్, ఎన్టీఆర్ ల నటన, కొరటాల శివ ఎమోషనల్ టేకింగ్ బలమైన అంశాలుగా ప్రేక్షకులను థియేటర్ల వైపు నడిపిస్తున్నాయి. ఇకపోతే ఈ చిత్రం యూఎస్ బాక్సాఫీస్ వద్ద సైతం మిలియన్ డాలర్ వసూళ్లు సాదించింది.