జనతా గ్యారేజ్ రెండు రోజుల వసూళ్ళ వివరాలు

3rd, September 2016 - 12:40:08 PM

Janatha-Garage
మొదటిరోజు బ్రహ్మాండమైన ఓపెనింగ్స్ ను రాబట్టిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘జనతా గ్యారేజ్’ చిత్రం నిన్న రెండవ రోజు కూడా అదే జోరు కొనసాగించింది. ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న వివరాల ప్రకారం రెండురోజులు కలిపి నైజాంలో రూ. 7.66 కోట్లు, సీడెడ్ రూ.4.44 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 3 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.58 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ.2.15 కోట్లు, నెల్లూరులో రూ. 1.04 కోట్లు, గుంటూరులో రూ.2.99 కోట్లు, కృష్ణాలో రూ.1.94 కోట్లు వసూలయ్యాయి.

ఈ తాజా లెక్కలతో కలిపి మొత్తం రెండు రోజుల షేర్ రూ. 25. 76 కోట్లకు చేరింది. పైగా ఈరోజు వీకెండ్, రేపు ఆదివారం కావడం, ఆ పై రోజు వినాయకచవితి సెలవు కావడం, పైగా మరో పెద్ద చిత్రం లేకపోవడం ఈ సినిమాకు బాగా కలిసొచ్చిన అంశం. మొదటిరోజైతే ఈ చిత్రం కొన్ని చోట్ల ‘బాహబలి’ రికార్డులను కూడా దాటేసినటు తెలుస్తోంది. ఈ ఘన విజయంతో దర్శకుడు కొరటాల శివ, హీరో తారక్ లు చాలా హ్యాపీగా ఫీలవుతున్నారు.