‘జనతా గ్యారెజ్’ ఫస్ట్ వీకెండ్ యూఎస్ కలెక్షన్స్!

6th, September 2016 - 08:28:38 AM

janatha-garage-2
యంగ్ టైగర్ ఎన్టీఆర్ – దర్శకుడు కొరటాల శివల క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘జనతా గ్యారెజ్’ సినిమా గత గురువారం ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైన విషయం తెలిసిందే. తారాస్థాయి అంచనాల మధ్యన విడుదలైన ఈ సినిమాలో ఎన్టీఆర్ ఎమోషనల్ పాత్రకు, ప్రధాన పాత్రలో నటించిన మోహన్ లాల్ పాత్రకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇక మొదటిరోజే సినిమాను చూసేయాలని ఎప్పట్నుంచో ఎదురుచూస్తోన్న అభిమానులంతా ఎన్టీఆర్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ తెచ్చిపెట్టారు.

రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలోనూ ఈ సినిమాకు అదిరిపోయే కలెక్షన్స్ వచ్చాయి. యూఎస్ బాక్సాఫీస్ వద్ద మొదటి వారాంతం పూర్తయ్యేసరికి ‘జనతా గ్యారెజ్’ 1.43 మిలియన్ డాలర్లు (సుమారు 9.51 కోట్ల రూపాయలు) వసూలు చేసింది. నాలుగు రోజుల లాంగ్ వీకెండ్ సినిమాకు బాగా కలిసి వచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో సమంత, నిత్యా మీనన్‌లు హీరోయిన్లుగా నటించారు.