‘జనతా గ్యారెజ్’ 5 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్

janatha-garage-2
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘జనతా గ్యారెజ్’ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపిస్తూ దూసుకుపోతోన్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై మొదట్నుంచే అంచనాలన్నీ తారాస్థాయిలో ఉండడంతో మొదటిరోజు నుంచే సినిమా చూసేయాలన్న ఉత్సాహంతో అభిమానులు ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ తెచ్చిపెట్టారు. ఐదు రోజుల లాంగ్ వీకెండ్ బాగా కలిసిరావడంతో ఈ ఐదు రోజుల్లో సినిమా ఏపీ, తెలంగాణా రెండు రాష్ట్రాల్లో కలుపుకొని 41.34 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది.

ఒక్క నైజాం ఏరియాలోనే ఐదురోజుల్లో 13.44 కోట్ల రూపాయలు వసూళ్ళు రావడం విశేషంగా చెప్పుకోవాలి. ఎన్టీఆర్ కెరీర్లోనే కాక, తెలుగు సినీ పరిశ్రమలోనూ ‘బాహుబలి’ తర్వాత ఇదే బిగ్గెస్ట్ ఓపెనింగ్‌. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో నిత్యా మీనన్, సమంత హీరోయిన్లుగా నటించారు. మొదటి 5 రోజులకు సంబంధించి ప్రాంతాల వారీగా కలెక్షన్స్ వివరాలు ఇలా ఉన్నాయి..

ఏరియా కలెక్షన్స్
నైజాం : 13.44 కోట్లు
సీడెడ్ : 7.45 కోట్లు
వైజాగ్ : 4.73 కోట్లు
తూర్పు గోదావరి : 3.55 కోట్లు
పశ్చిమ గోదావరి : 3.05 కోట్లు
కృష్ణా : 3.26 కోట్లు
గుంటూరు : 4.36 కోట్లు
నెల్లూరు : 1.50 కోట్లు
మొత్తం : 41.34 కోట్లు