‘జనతా గ్యారేజ్’ లేటెస్ట్ యూఎస్ కలెక్షన్స్!

12th, September 2016 - 08:23:17 AM

Janatha-Garage
యంగ్ టైగర్ ఎన్టీఆర్, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ కొరటాల శివల కాంబినేషన్‌లో వచ్చిన ‘జనతా గ్యారెజ్’ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపిస్తోన్న విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్యన సెప్టెంబర్ 1న విడుదలైన ఈ సినిమా పలుచోట్ల రికార్డు కలెక్షన్స్ సాధించి పదిరోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 70 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది. ఇక కొద్ది సంవత్సరాలుగా తెలుగు సినిమాకు పెద్ద మార్కెట్స్‌లో ఒకటిగా నిలుస్తూ వస్తోన్న యూఎస్‌లోనూ ‘జనతా గ్యారేజ్’ మంచి వసూళ్ళు రాబడుతోంది.

ఇప్పటివరకూ యూఎస్‌ బాక్సాఫీస వద్ద ఈ సినిమా 1.7 మిలియన్ డాలర్లు (సుమారు 11.42కోట్ల రూపాయలు) వసూలు చేసింది. సెకండ్ వీకెండ్ కూడా యూఎస్‌లో సినిమా మంచి కలెక్షన్స్‌నే సాధిస్తూ వచ్చింది. అయితే లాంగ్‌రన్‌లో సినిమా 2 మిలియన్ దాటుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ‘జనతా గ్యారెజ్‌’లో సమంత, నిత్యా మీనన్‌లు హీరోయిన్లుగా నటించగా, మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ ఓ ప్రధాన పాత్రలో నటించారు.