‘జనతా గ్యారెజ్’ మళయాల ఆడియో రిలీజ్ డేట్

janathagarage1
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తోన్న ‘జనతా గ్యారెజ్’ సినిమా రోజురోజుకీ ఆసక్తి పెంచేస్తూ విడుదలకు సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. ‘మిర్చి’, ‘శ్రీమంతుడు’ సినిమాలతో దర్శకుడిగా తనదైన బ్రాండ్ సృష్టించుకున్న కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాపై ఇప్పటికే ఉన్న అంచనాలను ఈమధ్యే విడుదలైన ట్రైలర్, ఆడియో తారాస్థాయికి చేర్చాయి. ఇక మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ ఓ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ సినిమా మళయాలంలోనూ డబ్ అవుతోన్న విషయం తెలిసిందే.

మోహన్ లాల్‌కు మళయాలంలో ఉన్న మార్కెట్ దృష్ట్యా అక్కడ పెద్ద ఎత్తున సినిమా విడుదలను ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 26న కొచ్చిలో మళయాల ఆడియో ఆవిష్కరణను పెద్ద ఎత్తున చేపడుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. సెప్టెంబర్ 2న విడుదల కానున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యా మీనన్‌లు హీరోయిన్లుగా నటించారు.